రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోంది” : ఎమ్మెల్యే బడేటి చంటి
27/April/2026 06:47
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సైతం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన,,, తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చంటి,,, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించీ, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ జనహితమే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదేసమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...