ఎలమంచిలిలో హాకీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ప్రారంభం – యువతలో క్రీడాస్ఫూర్తి పెంపు లక్ష్యం..

ఎలమంచిలిలో హాకీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ప్రారంభం – యువతలో క్రీడాస్ఫూర్తి పెంపు లక్ష్యం..

25/April/2026 21:34    Share:   

 అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 25 (క్రైo అనాలసిస్ ప్రతినిధి ఆనంద్):
ఎలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి హాకీ సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ తెలిపారు. ఈ క్యాంపులో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. హాకీ ఆటపై ఆసక్తి ఉన్న బాలబాలికలకు ప్రాథమిక నైపుణ్యాలు, శారీరక దృఢత్వం, జట్టు భావనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.విరివిగా ప్రతిరోజూ ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించి ఆటలో నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక శిక్షణతో పాటు భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో ఆడే అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ క్యాంపులో చేర్పించాలని కోరుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter