బ్లూ జెట్ పరిశ్రమకు మంత్రి లోకేశ్ చేతుల మీదుగా భూమిపూజకు సిద్ధం

బ్లూ జెట్ పరిశ్రమకు మంత్రి లోకేశ్ చేతుల మీదుగా భూమిపూజకు సిద్ధం

28/February/2026 07:11    Share:   

యలమంచిలి: ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ఎస్ఈజెడ్ పరిధి గల రాంబిల్లి మండలం, సీతపాలెం గ్రామం సమీపంలో బ్లూ జెట్ పరిశ్రమ భూమిపూజకు సర్వం సిద్ధమైంది. సెజ్ పరిధిలో ఏర్పాటు కానున్న బ్లూ జెట్ పరిశ్రమ నిర్మాణానికి ఈనెల 28న భూమిపూజ నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాంగణంలో వేదిక నిర్మాణం, అతిథుల కూర్చోవడానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్.పి ఆదేశాల మేరకు సీఐలు సిహెచ్ నర్సింగరావు, చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Breaking News

Subscribe our Newsletter