కల్తీ నెయ్యి పై విచారణ పూర్తి..! 30న ప్రభుత్వానికి నివేదిక..!!

కల్తీ నెయ్యి పై విచారణ పూర్తి..! 30న ప్రభుత్వానికి నివేదిక..!!

25/April/2026 21:30    Share:   

క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ :
తిరుమల తిరుపతి దేవస్థానము లో  కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తయ్యింది. ఫిబ్రవరి 20న నియమించబడిన ఈ కమిషన్, తిరుమలలో పలుమార్లు క్రైస్తవ ప్రచారాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్రంగా విచారణ చేపట్టింది.విచారణలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన సాక్ష్యాధారాలు సేకరించిన కమిషన్, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనున్నట్లు కమిషన్ తెలిపింది.ఇదిలా ఉండగా, గతంలో హైకోర్టు ప్రసాదం తయారీలో వాడే నేయ్యి నాణ్యత, మరియు తిరుమలలో జరుగుతున్న అనేక వ్యవహారాలపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఈ నివేదికలో కీలక అంశాలుగా చేర్చినట్లు సమాచారం.ఈ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
Breaking News

Subscribe our Newsletter