పెద్దపల్లి హైస్కూల్‌లో

పెద్దపల్లి హైస్కూల్‌లో 'ఖేల్ కూద్': ఆటపాటలతో అదరగొట్టిన ఎన్రోల్మెంట్ డ్రైవ్!

12/April/2026 16:39    Share:   

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చుట్టుపక్కల ఐదు గ్రామాలకు సంబంధించిన పిల్లలందరికీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ ఆదివారం నాడు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఉమామహేశ్వరి అధ్యక్షతన ఆకర్ష...ఖేల్ కూద్ పేరుతో ఐదు సంవత్సరాలు నుండి 14 సంవత్సరాల వయసున్న విద్యార్థులందరినీ  ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షించే విధంగా ఆదివారం ఉదయం 7:30 నుండి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులందరికీ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి మెడల్స్ బహూకరించి వారికి అల్పాహారాన్ని అందించి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది పెద్దపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఈ ఆటల పోటీలకు అనేక ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న  సుమారుగా 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు వారంతా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు విద్యా విధానము ఆటపాటలు తదితర అంశాలన్నింటినీ గురించి తెలుసుకొని పాఠశాలలో జాయిన్ అవ్వడం కోసం ఎంతో ఆసక్తిని కనపరిచారు ఒక వినూత్న ఆలోచనతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ జి ఎస్ చక్రవర్తి గారు ఆదర్శ  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వై సత్య రావు గారు శ్రీమతి వేలంగి రాణి గారు శ్రీమతి అరుణ గారు పాల్గొన్నారు శ్రీ తులసి రావు గారు ఎంతో చక్కగా ఆటపాటలన్నింటినీ నిర్వహించారు విద్యార్థులంతా ఆదివారం నాడు ఆటపాటలతో ఆనందించి అల్పాహారాన్ని తిని మజ్జిగ తాగి ఈ పాఠశాలలోనే చదువుతాము అంటూ ఆసక్తిని కనపరుస్తూ ఎంతో ఆనందంగా వారి ఇళ్లకు వెళ్లారు
Breaking News

Subscribe our Newsletter