కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులకు ప్రత్యేక ఆహ్వానం..!
25/April/2026 21:27
Share:
క్రైమ్ అనాలిసిస్ – టీవీఎస్ ప్రకాష్ : విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, పోలిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న RTI చట్టం ఉల్లంఘనలు మరియు అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.గతంలో రికార్డుల పరిశీలన కోసం వెళ్లిన CCR సభ్యులకు సంబంధిత అధికారులు సహకరించకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను చూపించకుండా, వివిధ సాకులు చెబుతూ సమాచారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఫిర్యాదులు చేసినప్పటికీ, 7 నెలలు గడిచినా జిల్లా పంచాయతీ కార్యాలయం (DPO) నుండి ఎటువంటి స్పందన రాకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రజా నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CCR ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో CCR సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కార్యక్రమ వివరాలు: వేదిక: జిల్లా కలెక్టర్ కార్యాలయం, విజయనగరంతేదీ: 27-04-2026 సమయం: ఉదయం 10:30 గంటలకు "మన హక్కుల కోసం… వ్యవస్థలో మార్పు కోసం… మనమంతా కలసి పోరాడుదాం!" విజయనగరం జిల్లా కమిటీ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) ? 9949319239, 9963621772.