డైట్ లో ప్రశాంతముగా ముగిసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు
25/April/2026 20:09
Share:
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (ఆటోనమస్), అనకాపల్లి లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET) ను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 96 % మంది విద్యార్థులు హాజరయ్యారు.పరీక్ష నిర్వహణలో సంస్థ యాజమాన్యం సమగ్ర ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణలో పరీక్షను నిర్వహించారు. పరీక్షా కేంద్రంలో తగిన సదుపాయాలు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు కల్పించారు.అదనంగా, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఉచితంగా తాగునీరు, బటర్‌మిల్క్ వంటి సౌకర్యాలు అందించారు. యెన్ ఎస్ ఎస్ యూనిట్ సభ్యులు, సిబ్బంది మరియు వాలంటీర్లు సేవలను అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు ఈ పరీక్ష ఎంతో ముఖ్యమని, అందరూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.