నాదెండ్ల భాస్కరరావు గారి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు..

నాదెండ్ల భాస్కరరావు గారి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు..

23/April/2026 07:28    Share:   

రాజకీయ దిగ్గజ నేత నాదెండ్ల భాస్కరరావు గారి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు..ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, ఏప్రిల్ 
ఆంధ్ర రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారైన శ్రీ నాదెండ్ల భాస్కరరావుగారు మృతి చెందారన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య వంటి దిగ్గజ నేతలతో పనిచేసిన ఆయన రాజకీయ రంగాన్ని సంచలనాత్మక మలుపులు తిప్పారు. శ్రీ భాస్కరరావు గారి రాజకీయ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.. చాలామంది నేతలతో రాజకీయ రంగంలో అక్షరాలు దిద్దించి, ముందుకు నడిపిన భాస్కరరావుగారు ఈ రాష్ట్రానికి గొప్ప గొప్ప నాయకులను అందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు కొనియాడదగినవి అన్నారు.. ఈ సందర్భంగా దివికేగిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. బాధాతప్తశోక హృదయాలతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. భాస్కరరావుగారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.
Breaking News

Subscribe our Newsletter