ఏలూరు పైపులైన్ల దెబ్బతినడంపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ కీలక సమీక్ష
20/April/2026 21:41
Share:
పైపులైన్ల దెబ్బతినడంపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ కీలక సమీక్ష – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. ఈరోజు (20.04.2026) సాయంత్రం 5.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయం, ఏలూరు లోని CZP చాంబర్‌లో జిల్లా పరిషత్ గౌరవ చైర్‌పర్సన్ గారి అధ్యక్షతన ఒక కీలక సమీక్ష సమావేశం నిర్వహించబడింది. సత్యసాయి CPWS పథకం కింద వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు పనుల కారణంగా పైపులైన్లు దెబ్బతినడం వంటి అంశాలపై ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO), ఏలూరు, డివిజన్ పంచాయతీ అధికారులు (DLPOs), ఎలక్ట్రికల్ విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE), RWS విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరవ చైర్‌పర్సన్ గారు మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి సరఫరా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, పైపులైన్లకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టంగా ఆదేశించారు. పైపులైన్ల నష్టం వల్ల నీటి సరఫరా అంతరాయం కలగకుండా చూడాలని పేర్కొన్నారు.అదేవిధంగా,బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశం ద్వారా సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించబడింది.