76 రోజులుగా భూముల కోసం దళితుల పోరాటం – ప్రభుత్వంపై రేబాక్ రాము ఆగ్రహం...
20/April/2026 12:55
Share:
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 20, ( క్రైo అనాలసిస్ రిపోర్టర్ ఆనంద్) : రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులు తమ భూముల కోసం 76 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఎలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు రేబాక్ రాము మండిపడ్డారు.అక్రమంగా భూములు లాగేసుకుంటున్నారని ఆరోపిస్తూ పేద రైతులు రోడ్డున పడిన పరిస్థితి దురదృష్టకరమన్నారు.అనేక సంఘాలు మద్దతు తెలిపినా అధికారుల నుంచి స్పందన రాలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూటాల్ జయలక్ష్మి, తెరపల్లి ప్రసన్న, గారపాటి చిన్నమ్మలు, జల్లూరు చిన్న, గూటాల రాంబాబు, గుడబండి కుమారి, బీర నూకరత్నం, గుడిసె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.