విదేశీ పాల ఉత్పత్తుల దిగుమతులను ఆపాలి.పాలకు గిట్టుబాటు ధర కల్పించి పాడి రైతులను ఆదుకోవాలి.

విదేశీ పాల ఉత్పత్తుల దిగుమతులను ఆపాలి.పాలకు గిట్టుబాటు ధర కల్పించి పాడి రైతులను ఆదుకోవాలి.

28/June/2026 20:09    Share:   

కూరగాయల రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు అందించాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్..
కొండల ప్రసాద్ CA న్యూస్,ఏలూరు .
పాడి,కూరగాయలు,నిమ్మ, వర్జీనియా పొగాకు తదితర పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆయా పంటల రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఆదివారం ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో రైతాంగ సమస్యలు - గిట్టుబాటు ధరలు అంశంపై రైతు సదస్సు నిర్వహించారు.
సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకు గిట్టుబాటు ధర రాక పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దాణా,ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ప్రైవేటు పాల డైయిరీలు కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్నాయని, ప్రభుత్వాలు మాత్రం పాడి రైతులకు పాడే కడుతున్నాయని విమర్శించారు. అమెరికాతో భారత్ చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాడి రైతులకు తీవ్ర నష్టమని, ఎటువంటి సుంకాలు లేకుండా పాలు,పాల ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి అయితే దేశీయంగా పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వద్దని కోరారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. పశువుల దాణా 75% సబ్సిడీపై ఇవ్వాలన్నారు. పాడి గేదెలు కొనుగోలుకు లోన్లు ఇవ్వాలని కోరారు.
కూరగాయల రైతులకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించడం లేదని, ఫలితంగా కూరగాయల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మార్కెట్లలో కూరగాయల రైతులను హోల్ సేల్ వ్యాపారులు చేస్తున్న సిండికేట్ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కూరగాయల రైతులకు విత్తనాలు, యాంత్రికరణ పరికరాలు సబ్సిడీపై ఇవ్వాలన్నారు.నిమ్మ రైతులకు కూడా తగిన ధర రావడంలేదని, చీడపీడలతో నష్టపోతున్నారన్నారు. నిమ్మ రైతులను ఆదుకోవాలన్నారు. వర్జినియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జులై 3,4,5 తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్లో పాడి, కూరగాయలు, నిమ్మ, వర్జీనియా పొగాకు తదితర పంటల రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామని వివరించారు. జులై 3న హాలో రైతన్న - ఛలో ఏలూరుకు అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు ఆర్.లింగరాజు, పి.రామకృష్ణ, బొడ్డు రాంబాబు ఆయా పంటల రైతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter