ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు తన వంతు సాయం..!!  శ్రీ అభయాంజనేయ స్వయం సంక్షేమ సేవా సంఘం

ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు తన వంతు సాయం..!!  శ్రీ అభయాంజనేయ స్వయం సంక్షేమ సేవా సంఘం

08/April/2026 10:37    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్,:
గ్రేటర్ విశాఖ 85వ వార్డు లంకెలపాలెం జంక్షన్ సమీపంలోని గంజిపేటలో వెలసి ఉన్న శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా సేవాభావం మరోసారి ప్రతిఫలించింది. ఆలయ నిర్మాణదాత లగ్గిశెట్టి అప్పలరాజు బంధువు, ఆలయ నిర్మాణ భాగస్వామి అయిన గొలుసు గణేష్ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం రోజున పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.గత నాలుగు సంవత్సరాలుగా పదిమంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.10,000 చొప్పున సహాయం చేస్తూ వారి విద్యాభ్యాసానికి తోడ్పడుతున్నారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే తనకు చదువు మీద ఆసక్తి ఎక్కువగా ఉండేదని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని చదువులో ముందుకు వచ్చి ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నానని తెలిపారు. తనలాంటి పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయం చేస్తున్నట్లు చెప్పారు.ఈ సేవా కార్యక్రమంపై గంజిపేట శ్రీ అభయాంజనేయ స్వయం సంక్షేమ సేవా సంఘం సభ్యులు గణేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Breaking News

Subscribe our Newsletter