విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో 15న 'చలో ఈపీడీసీఎల్ సీఎండీ ఆఫీస్'
14/July/2026 20:35
Share:
అనకాపల్లి విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై జులై 15న ఏపీ ఈపీడీసీఎల్ సీఎండి సామూహిక వినతి పత్ర కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ ఈరోజు సిఐటియు కార్యాలయంలో గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వం విద్యుత్తు ఉద్యోగులను, కాంట్రాక్ట్ కార్మికులను మోసగిస్తుందని పిఆర్సి వెంటనే వేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేక కనీసం పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్లుగా 48 వేల రూపాయల బేసిక్ ను కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తుందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం, రెగ్యులరైజేషన్ కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని దశల వారి పోరాటంలో భాగంగా జులై 15న విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయం వద్దకు విద్యుత్ ఉద్యోగులు అందరు చేరుకొని జయప్రదం చేయాలని వారు కోరారు. ప్రేమ చంద్రశేఖర్ , సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాపాడ సత్యనారాయణ, ఎస్ సత్యారావు, అనకాపల్లి డివిజన్ అధ్యక్షులు పి శ్రీనివాసరావు, నర్సీపట్నం డివిజన్ అధ్యక్షులు ఎస్ రమేష్, సీనియర్ నాయకులు జమీల్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్ అవతారం, కె. రాజేష్, కె పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.