రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కర్రి అప్పారావు
రాంబిల్లి
మండలంలో, అప్పన్నపాలెం, గొరపూడి, ఎస్ ఈ జెడ్ భూ నిర్వాసితులైన రైతులతో, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, జిల్లా అధ్యక్షులు, కర్రీ అప్పారావు, జిల్లా నాయకులు N నారాయణ రావు నిర్వాసిత రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాసం చూపించకుండా, ఉపాధి చూపకుండా, ఏ ప్రభుత్వమైనా, రైతులు భూముల్లోకి వెళ్లడం గాని, గ్రామాలను బలవంతంగా తరలించడం గాని జరగలేదని అన్నారు. మన జిల్లాలో, ముఖ్యంగా మన ప్రాంతంలో, అప్పన్నపాలెం, గొరపూడి రైతుల భూములు చుట్టూ, సిమెంట్ స్తంభాలు వేసి, ఇనుప మెస్సలు బిగించి, రైతులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా, ఇంతటి అన్యాయం ఎక్కడా జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని చెప్పి, ఇంత దగా చేయడం ప్రభుత్వాలకు తగునా అని ప్రశ్నించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి, పాసు బుక్కుల పై ఫోటో పెట్టుకున్నందుకే రాద్ధాంతం చేసిన కూటమి ప్రభుత్వం, నేడు రైతుకు నష్టపరిహారం ఇవ్వకుండా, పునరావాసం చెల్లించకుండా, ఉపాధి ఇవ్వకుండా, ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు, వందలాది ప్రైవేట్ ప్రభుత్వ భూములను అప్పజెప్పడం ఈ ప్రభుత్వాలకు తగునా అని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలపై, రైతు సంఘం అండగా ఉంటుందని, ప్రభుత్వాలు, జిల్లా అధికార యంత్రాంగం, రైతులపై దౌర్జన్యం ప్రదర్శించకుండా, కంపెనీలకు సహకరిస్తూ, అభివృద్ధికి సహకరిస్తూ ఉన్న రైతులకు పరిహారం చెల్లించకపోతే, నిర్వాసితులందరినీ ఏకం చేసి, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా నాయకులు, జి దేవుడు నాయుడు, కూండ్రపు సోము నాయుడు, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.