కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..!!!
17/March/2026 18:43
Share:
అనకాపల్లి జిల్లా, యలమంచిలి క్రైమ్ అనాల్సిస్ – టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్), యలమంచిలి యలమంచిలి నియోజకవర్గంలోని కొక్కిరాపల్లి గ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల/జూనియర్ కాలేజీని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, విద్యాబోధన విధానాన్ని పరిశీలించిన ఆయన, అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, విద్యార్థులతో కలిసి కూర్చొని ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ను స్వయంగా రుచి చూశారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పౌష్టికాహారంపై ఆరా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొంటూ, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతున్నదా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సూచనలు భోజన నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారు.విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు