CA. న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
ఎలమంచిలి మండలంలోని ప్రతి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని సీఐ ఎస్. ధనుంజయరావు ఉత్సవ కమిటీలకు సూచించారు. విగ్రహాల వద్ద అవసరమైన సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని, నిమజ్జన సమయంలో ప్రజలు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిబంధనలకు అనుగుణంగా పరిమిత శబ్దంతో సౌండ్ సిస్టమ్ వినియోగించాలని, రాత్రి 10 గంటల తర్వాత డీజే బాక్సులు, సౌండ్ స్పీకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించడం, మత్తులో ఊరేగింపుల్లో పాల్గొనడం, అసభ్యకర నృత్యాలు, అనుచిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.