ఎలమంచిలి ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026..

ఎలమంచిలి ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026..

30/July/2026 19:03    Share:   

ఎలమంచిలి ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026 క్రీడా పోటీలను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, గారు .కొత్తపేట ఎమ్మెల్యే బండారి సత్యానంద్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో 12 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 26 వరకు జరిగే ఈ పోటీల్లో 17 సంవత్సరాల లోపు, 23 సంవత్సరాల లోపు రెండు విభాగాల్లో క్రీడాకారులు పాల్గొంటారు.నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు. యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి సరైన అవకాశాలు కల్పించడమే అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026 లక్ష్యమని తెలిపారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు.క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ యువతను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఎలమంచిలి నియోజకవర్గం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గారు.పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడా అధికారులు, కూటమి నాయకులు, క్రీడాకారులు, యువత, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter