విజయనగరం పార్లమెంట్ పరిధిలోని కూటమి నాయకుల సమావేశం..

విజయనగరం పార్లమెంట్ పరిధిలోని కూటమి నాయకుల సమావేశం..

16/October/2026 21:06    Share:   

కూటమి నేతల సమన్వయంతో ఎన్నికల కార్యాచరణకు ప్రణాళిక
 
*విజయనగరం | అక్టోబర్ 16:-* విజయనగరం టీడీపీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ, పరిశీలకులు శ్రీ చింతకాయల విజయ్ గారి పరిశీలనలో జరిగిన ఈ సమావేశంలో రానున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన కార్యాచరణ, కూటమి నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు పాల్గొన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరంపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వంటి అంశాలపై సమీక్షించారు.
కూటమి నాయకుల మధ్య ఐక్యత, సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ఎన్నికల కార్యాచరణను సమష్టిగా ముందుకు తీసుకెళ్లడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో చర్చించారు.
Reporter s.a.n raju cheepurupalli

Breaking News

Subscribe our Newsletter