అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అపారావు నాయుడు యలమంచిలి మండలంలో పర్యటన – కేజీబీవీ ఏర్పాటుకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు వినతి

అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అపారావు నాయుడు యలమంచిలి మండలంలో పర్యటన – కేజీబీవీ ఏర్పాటుకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు వినతి

18/April/2026 07:32    Share:   

క్రైమ్ అనాల్సిస్, టివియస్ ప్రకాష్, యలమంచిలి :
అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అపారావు నాయుడు యలమంచిలి మండలంలో పూలపర్తి సమీపంలోని సంపత్ సాయి పాఠశాలలో పౌండేషన్ లిటరసీ సర్వే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం యలమంచిలి మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేష గిరిరావును మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా విద్యాశాఖాధికారి, స్థానిక పరిస్థితులు మరియు విద్యా అవసరాలపై చర్చించారు. మండల ప్రజల అభీష్టం మేరకు యలమంచిలి మండలానికి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల (KGBV) ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి చేశారు.
దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అపారావు నాయుడు, ఈ ప్రతిపాదనను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు సూర్య ప్రకాష్, అరుణ్ కుమార్, మండల పరిషత్ పరిపాలన అధికారి శ్రీనివాస్, సిబ్బంది మరియు పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter