డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని 'సర్వేజన ఐక్యవేదిక' ఆధ్వర్యంలో, కోరిబిల్లి పరి సారధ్యంలో ఏర్పాటు చేసిన 'రక్తదాత-ప్రాణదాత' రక్తదాన శిబిరం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు శిబిరాన్ని ప్రారంభించారు.
ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులకు ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన సర్వేజన ఐక్యవేదిక సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.