రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు,కారు డ్రైవర్‌పై కేసు నమోదు.
30/June/2026 21:50
Share:
ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్.హెచ్.-16 జాతీయ రహదారిపై, పెద్దపల్లి జంక్షన్ -టిడ్కో కాలనీ మద్యలో రోడ్డు ప్రమాదం. మేకల సూర్య కార్తీక్ (20), నివాసం టిడ్కో కాలనీ, రాంనగర్, ఎలమంచిలి, తన స్నేహితుడు గుర్రాల గౌతంతో కలిసి రహదారి దాటేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉండగా, AP40 AG 3866 నంబరు గల కారు డ్రైవర్ రెండు లారీలను ఎడమ వైపు నుండి అతివేగంగా ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి మేకల సూర్య కార్తీక్‌ను ఢీకొట్టాడు. అనంతరం కారు రోడ్డు దిగువకు వెళ్లి చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో మేకల సూర్య కార్తీక్ తీవ్రంగా గాయపడగా, కారు డ్రైవర్ గుగ్గిలపు రామకృష్ణ మరియు కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య గుగ్గిలపు కల్యాణి కూడా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఎన్‌టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, అనకాపల్లికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మేకల సూర్య కార్తీక్‌ను బి-వన్ హాస్పిటల్, అనకాపల్లికి, కారు డ్రైవర్ మరియు ఆయన భార్యను పిన్నాకిల్ హాస్పిటల్, విశాఖపట్నంకు తరలించారు. గాయపడిన మేకల సూర్య కార్తీక్ ఫిర్యాదు మేరకు ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...