యలమంచిలిలో టీడీపీ ఘన వేడుకలు – చంద్రబాబు జన్మదినం సందర్భంగా నాయకుల సమక్షంలో మాజీ సర్పంచ్ లక్ష్మీకి విశిష్ట సన్మానం... (క్రైo అనాలిసిస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 20: యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ గారికి పదవి పూర్తి చేసిన సందర్భంగా ప్రత్యేకంగా సన్మానం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, సీనియర్ నాయకులు పప్పల చలపతిరావు, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరావు, మాజీ ఎంపీపీ విజయ్ బాబు చేతుల మీదుగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, దేవరపు మోహన్, దారా పోలిశెట్టి, పోలుమూరి నాగేశ్వరరావు, ఊడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు పార్టీ ఐక్యతను ప్రతిబింబిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. నాయకులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.