కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు. భారతదేశ సామాజిక విప్లవకారుడు, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి, మండల్ కమిషన్ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్) వర్ధంతిని బీసీ కులాల జేఏసీ (Joint Action Committee) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కమిటీ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి బీపీ మండల్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ఇచ్చిన నివేదిక బీసీల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు.జేఏసీ డిమాండ్లు & తీర్మానాలు:మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.బీసీ కులాల ఐక్యతతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.రాజకీయంగా, ఆర్థికంగా బీసీలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.బీపీ మండల్ ఆశయ సాధన కోసం బీసీ కులాల జేఏసీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు, వివిధ బీసీ సంఘాల నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.