యలమంచిలిలో ఫైనాన్స్ వ్యాపారి అనుమానాస్పద మృతి: కేసు నమోదు
12/April/2026 21:24
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : అనకాపల్లి జిల్లా యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి ఘటన నమోదు అయింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు రాయి భార్గవి (38), 18వ వార్డు కౌన్సిలర్, ASR కాలనీ, యలమంచిలి నివాసి. ఆమె భర్త రాయి దుర్గా నాగ వెంకట సతీష్ @ సతీష్ (42), యానాద్రి కాలనీ నివాసి, ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. ఆయనకు మద్యం సేవించే అలవాటు ఉండగా, సుమారు ఆరు నెలల క్రితం పచ్చకామెర్లు (జాండిస్) వ్యాధితో బాధపడినట్లు తెలిసింది.12-04-2026 తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో మామిడి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెం.303, యలమంచిలి వద్ద సతీష్ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా, ఆయన హాల్‌లో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.ప్రాథమిక విచారణలో, సతీష్ ఆ ప్రదేశానికి తరచుగా వెళ్తుండేవారని పోలీసులు గుర్తించారు. మరణానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.