డాక్టర్ కత్తి పద్మారావు గారు త్వరగా కోలుకోవాలి సీనియర్ దళిత బహుజన నాయకుడు నేతల రమేష్ బాబు 

డాక్టర్ కత్తి పద్మారావు గారు త్వరగా కోలుకోవాలి సీనియర్ దళిత బహుజన నాయకుడు నేతల రమేష్ బాబు 

08/April/2026 19:52    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ,ఏలూరు 
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏలూరు కొత్త రోడ్లో గల నవసమాజ్ సొసైటీ కార్యాలయంలో దళిత బహుజన నాయకుల సమావేశం జరుగింది ఈ సమావేశంలో నేతల రమేష్ బాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 136 వ జయంతి సందర్భంగా దళితుల ఆత్మ గౌరవ పోరాట యోధుడు కవి రచయిత అభినవ అంబేద్కర్ దళిత బహుజన బంధు డాక్టర్ కత్తి పద్మారావు గారి ని ఏలూరు లో ఘనంగా సత్కరించి సన్మానించాలని అనుకున్నామని కాని దురదృష్టవశాత్తు ఆయన తుంటి ఎముక చిట్లడం వల్ల సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో ఆపరేషన్ చేసారని  తెలియ చేస్తూ హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యి హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొంటూ ఆయన త్వరగా కోలుకొని తన గళాన్ని తన కలాన్ని అణగారిన వర్గాల కోసం మరింత గా పదును పెట్టాలి అని కోరారు డాక్టర్ కత్తి పద్మారావు గారు అనారోగ్యానికి గురి కావడంతో కొంత మంది వ్యక్తులు చందాలు వసూలు చేసి ఆయనకు ఆర్థిక సహాయం అందచేయాలని ప్రయత్నిస్తున్నారని ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు ఏమి చేయవద్దని తెలియ చేసారు ఈ సమావేశంలో బయ్యారపు వెంకట రమణ, ఆర్ శేషగిరి,దాలయ్య సహదేవుడు,ఫరహాద్ తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter