ఏలూరులో దళిత–క్రైస్తవ శంఖారావం..

ఏలూరులో దళిత–క్రైస్తవ శంఖారావం..

27/June/2026 21:26    Share:   

ఏలూరులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న దళిత–క్రైస్తవ సమర శంఖారావం విజయవంతం చేయాలని జడ శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ రోజు ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ:

  • పత్రిక స్వేచ్ఛ ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని అన్నారు.

  • ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి మతాన్ని పాటించే, ప్రచారం చేసే హక్కు ఉందని గుర్తు చేశారు.

  • రఘురామకృష్ణ రాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయనపై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నలు లేవనెత్తారు.

  • రాష్ట్ర ప్రజల సొమ్ముతో నెలకు ఇరవై లక్షలు ఖర్చు అవుతుంటే, ప్రజల భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

  • "రెండు చక్కల దేవుడు" అని చేసిన విమర్శలపై త్వరలో రాజకీయ సమాధి కట్టబోతున్నామని హెచ్చరించారు.

  • ఆదివారం జరిగే సభలో 33 డిమాండ్స్ తో లక్షలాది మంది పాల్గొంటారని తెలిపారు.

  • క్షమాపణలు అడగకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నామని స్పష్టం చేశారు.

  • ప్రజాస్వామ్యం బ్రతకాలని, జర్నలిస్టుల హక్కులు కాపాడాలని పిలుపునిచ్చారు.

  • మత చిచ్చుతో పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారిందని ఉదాహరణగా చెప్పారు.

  • ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

  • ఎన్డీఏ కూటమి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

రేపు ఏలూరులో జరిగే దళిత–క్రైస్తవ సమర శంఖారావ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలని కోరారు.పాల్గొన్న నేతలు ఈ సమావేశంలో చాగంటి సంజీవ్ ఐఆర్ఎస్, నేతల రమేష్ బాబు, మెండెం సంతోష్ కుమార్, పల్లెం ప్రసాద్, జక్కుల బెనర్జీ, గొల్ల నరేష్, పెరికే వరప్రసాద్, పర్సా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 
Breaking News

Subscribe our Newsletter