క్యూబాపై అమెరికా ఆర్థిక దిగ్బంధనం అమానుషం - సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు

క్యూబాపై అమెరికా ఆర్థిక దిగ్బంధనం అమానుషం - సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు

08/April/2026 06:40    Share:   

​అచ్యుతాపురంలో క్యూబా కీ మద్దత్తు గా మంగళవారం విరాళాలు సేకరణ.
అమెరికా విధిస్తున్న అక్రమ ఆర్థిక దిగ్బంధనం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలంలో భారీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, సామ్రాజ్యవాద ధోరణితో అమెరికా వ్యవహరించడం అమానుషమని అన్నారు. ఆహారం, మందులు వంటి కనీస అవసరాలను కూడా క్యూబా పొందకుండా అడ్డుకోవడం ప్రపంచ శాంతికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.
​క్యూబా స్ఫూర్తి - అండగా భారత్:ప్రపంచానికే వైద్య సహాయం అందించడంలో ముందుండే క్యూబాకు నేడు కష్టకాలం వచ్చిందని, ఆ దేశానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అచ్యుతాపురం ప్రజలు స్పందించి క్యూబా ప్రజల కోసం విరాళాలు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.​ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో సిపిఎం కన్వీనర్ ఆర్ రాము, మండల కమిటీ సభ్యులు  కూండ్రపు సోమునాయుడు, సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, చేపల తాతయ్యలు, కడారి అప్పారావు, రొంగలి లక్ష్మి, కాసులమ్మ, సదాశివ తదితరులు పాల్గొని వీధివీధినా తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు.
Breaking News

Subscribe our Newsletter