స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డుల పురోగతిపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డుల పురోగతిపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

15/May/2026 14:58    Share:   

క్రైమ్ అనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ఏ
అనకాపల్లి:జిల్లాలో అమలవుతున్న స్వర్ణ గ్రామం,స్వర్ణ వార్డుల కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాలు,వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 24 మండలాల పరిధిలోని స్వర్ణ గ్రామాలు మరియు మూడు అర్బన్ స్వర్ణ వార్డుల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ప్రతి గ్రామం, వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
ప్రత్యేకంగా గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాలు, డ్రైనేజీ వంటి సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు. అలాగే గ్రామ స్థాయిలో ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter