యోగాంధ్ర కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ టెలి కాన్ఫరెన్స్

యోగాంధ్ర కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ టెలి కాన్ఫరెన్స్

06/June/2026 20:42    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,  ఏలూరు, 
జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంపై  పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వ్రక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో జేసీ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఈనెల 7, 8, 9 తేదీలలో గ్రామ స్థాయిలో, 10, 11, 15 తేదీలలో మండల స్థాయిలోను  యోగాసనాలు, యోగాపై    స్లొగన్స్, పాటలు, షార్ట్ ఫిలిమ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, క్విజ్, తదితర అంశాలపై  పోటీలు నిర్వహించాలన్నారు.  యోగాంధ్ర కార్యక్రమంలో, పోటీలలో పాల్గొనే వారు, మాస్టర్ ట్రైనర్లు, యోగాంధ్ర యాప్ లో తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.   యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు 'స్టూడెంట్స్ థీమ్' కేటాయించారని, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు  కూడా యోగా, పోటీలలో పాల్గొనేలా చూడాలన్నారు.  మాస్టర్ ట్రైనర్లకు ఈనెల 6వ తేదీన శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని, అనంతరం వారు   స్వర్ణ గ్రామ,వార్డు సచివాలయ స్థాయి ట్రైనర్లు శిక్షణ అందించాని  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.  ఈనెల 7వ తేదీ నుండి 20 వతేదీ వరకు, 21 వ తేదీన జిల్లా స్థాయి  యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సంబంధించి యోగ ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీ లు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో  యోగా కార్యక్రమాలు, వాకదాన్, తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ఈనెల 7వ తేదీన ప్రారంభ కార్యక్రమం, 21వ తేదీన జిల్లా స్థాయిలో పెద్దఎత్తున ప్రజలతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా  ఈనెల 11 వ తేదీన ద్వారకా తిరుమలలోని హరిత హోటల్ లోను, 19వ తేదీన పోలవరం మండలం పట్టిసీమలో    ప్రజలతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. 
జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,  ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter