వడ్లపూడిలో దారుణం: ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి

వడ్లపూడిలో దారుణం: ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి

06/April/2026 08:13    Share:   

విశాఖపట్నం: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్లపూడిలో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మనస్పర్థల కారణంగా తనతో సన్నిహితంగా ఉంటున్న ఓ మహిళ నివాసానికి నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది
వడ్లపూడికి చెందిన పుష్ప అనే మహిళ గత కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో సాయికృష్ణ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది సన్నిహితంగా మారింది. అయితే, గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ గొడవల నేపథ్యంలో ఆగ్రహానికి గురైన సాయికృష్ణ, ఆమెపై కక్ష పెంచుకున్నాడు ఈ క్రమంలోనే పుష్ప ఇంటికి చేరుకున్న సాయికృష్ణ, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసి ఇంటికి నిప్పు అంటించాడు. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడటంతో ఇంట్లోని సామాగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడు సాయికృష్ణ కోసం గాలింపు చేపట్టారు.
Breaking News

Subscribe our Newsletter