డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు.

14/April/2026 15:24    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం యస్. రాయవరం, జేవీ పాలెం, ఎస్‌ఆర్ పేట, పెద్దపల్లి గ్రామాల్లో ఓబీసీ చైర్మన్ సుందరపు ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.జై భీమ్ నినాదాలతో ఊరేగింపులు నిర్వహిస్తూ, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, కులమత భేదాలను పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా పురవీధుల్లో మేళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపులు నిర్వహించి, అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజల్లో చాటిచెప్పారు.
Breaking News

Subscribe our Newsletter