అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం: వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి?

అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం: వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి?

04/April/2026 06:45    Share:   

అనకాపల్లి: జిల్లాలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టిన రెండు రోజులకే ఓ పసికందు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, కనీస సౌకర్యాల లేమి వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 1వ తేదీన తులసి అనే మహిళ ప్రసవం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే, శనివారం నాటికి ఆ శిశువు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడం, ఆ సమయంలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడమే బాబు మరణానికి కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
బాధిత కుటుంబం ఆందోళన:
కళ్లముందే పసికందు ప్రాణాలు పోవడంతో తట్టుకోలేకపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. "వైద్యుల చేతగానితనం వల్ల ఇంకెంత మంది పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలవాలి?" అంటూ నినదించారు. ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో కనీసం విద్యుత్ సరఫరా (జనరేటర్) సౌకర్యం కూడా లేకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఈ ఘటన పలు సందేహాలను రేకెత్తిస్తోంది. అధికారులు దీనిపై స్పందించి విచారణ జరపాల్సి ఉంది.
Breaking News

Subscribe our Newsletter