విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గీకరణ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఎంబీసీ సంక్షేమ సంఘం నేతలు శుక్రవారం విజయవాడలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిశారు.
సి.ఏ న్యూస్ ఏలూరు ఇంచార్జ్ కొండల ప్రసాద్
ఈ సందర్భంగా ఏలూరు,ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎం.వి.వి. సత్యనారాయణ మూర్తి, మరియు లంకా వెంకటేశ్వర్లు కమిషన్ చైర్మన్‌కు సానుకూల సమాచారాన్ని, గణాంకాలను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ తప్పనిసరని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ,ఎంబీసీ జాబితాలో మరికొన్ని కులాలను చేర్చాల్సిన అవసరం ఉందని, ఆయా కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై క్షేత్రస్థాయి విశ్లేషణను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సానుకూలంగా స్పందించారని నేతలు వెల్లడించారు.