అనకాపల్లి నూకాలమ్మ తల్లి రాష్ట్ర పండుగ సందర్భంగా భక్తి, ఆధ్యాత్మికత కార్యక్రమాలు
02/April/2026 06:42
Share:
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్: శ్రీనివాస్ అనకాపల్లి పట్టణంలో నూకాలమ్మ తల్లి రాష్ట్ర పండుగ సందర్భంగా భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది.నూకంబిక దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, కమిటీ చైర్మన్ ఆధ్వర్యంతో పాటు కూటమి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరియు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ భీమరిశెట్టి రామ్ పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో పండుగ వేడుకలు సజావుగా, భక్తిశ్రద్ధలతో సాగాయి.చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనంలో సనాతన ధర్మం, భక్తి మార్గం, మానవ జీవితంలో ఆధ్యాత్మికత ప్రాధాన్యత గురించి విపులంగా వివరించారు. ఆయన సందేశం భక్తులను ఆకట్టుకొని, ఆధ్యాత్మిక చింతనకు ప్రేరేపించింది.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.