సిద్దార్ధ అసోసియేషన్ ఆధ్వర్యములో ప్రపంచ అనాధల దినోత్సవం ..
20/April/2026 10:55
Share:
అనాధలకు చీరలు, దుస్తులు లుంగీలు,తువ్వాళ్ళు పంపిణీ.( బట్టలు పంపిణీ ) అనకాపల్లి.. సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్, అనకాపల్లి ఉదయం సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్,ఆధ్వర్యములో చినరాజుపేట శ్రీ సాంభశివ దేవాలయం వద్ద ప్రపంచ అనాధల దినోత్సవమును అనాధ వృద్ధులతో కలసి ఘనముగా నిర్వహించారు.ముందుగా భగవాన్ బుద్ధుని చిత్రపటానికి సంస్థ అధ్యక్షులు బల్లానాగభూషణం పూల మాల వేసి పూజలు చేశారు.అనంతరం నిరుపేద అనాధ వృద్ధులకు చీరలు, దుస్తులు, లుంగీలు, తువ్వాళ్ళు బల్లా నాగభూషణం చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భముగా బల్లానాగభూషణం మాట్లాడుతూ ప్రపంచ అనాధల దినోత్సవాన్ని దేవాలయంవద్ద నిరుపేద అనాధ వృద్ధులతో కలసి నిర్వహించుకోవడ ము, నిరుపేదలైన అనాధ వృద్ధులకు మానవసేవే.. మాధవసేవ అనే ఆశయ స్పూర్తితో అనాధలకు బట్టలు పంపిణీ వితరణ సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగిందని అన్నారు.ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధముగా అనాధలకు, నిరుపేదలకు సహాయాన్ని అందించి మానవతతో ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమములో సంస్థ అధ్యక్షులు బల్లానాగభూషణం, సహాయకార్యదర్శి రొబ్బి మల్లేశ్వరరావు,కార్యవర్గ సభ్యులు అయ్యగారు వెంకట రమణ మూర్తి, బూడిద జోగారావు,దేవాలయ భక్తులు కె.రామకృష్ణ,ఎమ్.రామారావు శ్రీమతి బూడిద కుమారి,శ్రీమతి కాలేపు భవాని,తదితరులు పాల్గొన్నారు.