
ఏలూరు, జులై 25: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – 2026 కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.
కలెక్టరేట్ నుండి శనివారం ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టర్ SIR-2026 ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 16 లక్షల 44 వేల 193 మంది ఓటర్లకు వందశాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామన్నారు. ఓటర్ల నుండి ఫారాలు సేకరించి, బీఎల్ఓలు వందశాతం డిజిటైజేషన్ పూర్తి చేశారని తెలిపారు.
ASD (Absent, Shifted, Dead) డిస్క్రెపెన్సీల పరిశీలనలో మొత్తం 31,600 కేసులు ఉండగా, వాటిలో 9,846 కేసులకు ఎలాంటి చర్య అవసరం లేదని ధృవీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన 21,749 కేసులను అన్-కలెక్టబుల్గా గుర్తించామని, వీటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో ఇంచార్జి డీఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.