గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న కే కోటపాడు పోలీసులు.  100 కిలోల గంజాయి. కారు స్వాధీనం.

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న కే కోటపాడు పోలీసులు. 100 కిలోల గంజాయి. కారు స్వాధీనం.

05/February/2026 20:27    Share:   

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న కే కోటపాడు పోలీసులు.  100 కిలోల గంజాయి. కారు స్వాధీనం.
ఇద్దరి అరెస్ట్. 
అనకాపల్లి డిఎస్పి శ్రావణి

సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద్
ప్రెస్ నోట్ తేదీ: 05-02-2026 స్థలం: కే కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా

❖ అనకాపల్లి జిల్లా కె. కోటిపాడు మండలంలో ఆక్రమ గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీస్ శాఖ పెద్ద విజయం సాధించింది. విశ్వసనీయ సమాచారం మేరకు District Special branch వారు ఎస్.ఐ., కె. కోటిపాడు గారికి సమాచారం అందించగా, తక్షణమే వాహనాల తనిఖీ నిర్వహించారు.

❖ తేదీ 04-02-2026 సాయంత్రం సుమారు 17.00 గంటల సమయంలో చట్టవారి కల్పాటి ప్రాంతంలో MP 09 CF 9966 నెంబర్ గల తెలుపు రంగు  వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయి (రెండు మూటలుగా) స్వాధీనం చేసుకున్నారు.

❖ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు:

  1. అబ్దుల్ హాకీమ్ (30 సంవత్సరాలు) – దైవర్, కర్ణాటక రాష్ట్రం నివాసి,

  2. సయ్యద్ సమీర్ అలీ (35 సంవత్సరాలు) – దైవర్, తెలంగాణ రాష్ట్రం నివాసి.

❖ వారి వద్ద నుండి 03 సెల్ ఫోన్లు, వాహన రికార్డులు స్వాధీనం చేసుకొని, సెక్షన్ 50 NDPS చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. నిందితులు హైదరాబాద్ నుడి ఒడిశా రాష్ట్రం  వెళ్లి గంజాయిని లోడ్ చేసి తిరిగి హైదరాబాద్ తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు.

❖ ఈ కేసులో ఉపయోగించిన వాహనం, గంజాయి మూటలు మరియు ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకొని, చట్టపరమైన చర్యలు చేపట్టారు.

❖ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనకు గట్టి చర్యలు చేపడుతూ, యువతను మరియు సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు నిరంతరంగా అవగాహన కార్యక్రమాలు మరియు తనిఖీలు నిర్వహిస్తున్నాము.

❖ డ్రగ్స్ వాడకం వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబాలు మరియు సమాజ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ముఖ్యంగా యువత ఈ మత్తు పదార్థాల ఉచ్చులో పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

❖ మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విలవకు లేదా వినియోగం చట్టపరంగా తీవ్రమైన నేరమని తెలియజేస్తూ, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారిపై NDPS చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్నాము.

❖ ప్రజల సహకారం మా బలమని, డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా జిల్లా కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని కోరుతున్నాము. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

❖ డ్రగ్స్కు No చెప్పండి – జీవితానికి Yes చెప్పండి.
మన సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి విముక్తం చేయడానికి కలిసి ముందుకు సాగుతాం.

 
అనకాపల్లి డిఎస్పి శ్రావణి


Breaking News

Subscribe our Newsletter