ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై తెదేపా సమగ్ర సమీక్ష..

ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై తెదేపా సమగ్ర సమీక్ష..

15/September/2026 18:59    Share:   

ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై తెదేపా సమగ్ర సమీక్ష: నాయకుల కీలక దిశా నిర్దేశం
ఎలమంచిలి పట్టణంలోని వార్డుల వారీగా రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ శ్రీ పప్పల చలపతిరావు మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) ఛైర్మన్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గార్ల సమక్షంలో, ఎలమంచిలి టౌన్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గొర్లె  శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన ఈ సమావేశం ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ప్రతీ వార్డులోనూ పార్టీ బలాబలాలు, ఓటర్ల నమోదు, చేరికలు మరియు స్థానిక సమస్యలపై నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.మాజీ ఎంపీ శ్రీ పప్పల చలపతిరావు గారు మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలమంచిలి మున్సిపాలిటీపై తెదేపా జెండా ఎగురవేసేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.టౌన్ పార్టీ అధ్యక్షుడు శివనారాయణమూర్తి (నానాజీ) గారు మాట్లాడుతూ కూటమి  ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  కొటారు సాంబ గారు, ఆర్ఎస్ నాగేశ్వరరావు గారు, ఆడారి రమణ బాబు గారు,  అధికార ప్రతినిధి దాడి రమేష్ గారు, బొద్దపు శ్రీనివాస్ రావు గారు, రవికుమార్ గారు, ఆడారి సన్యాసి నాయుడు గారు, భీశెట్టి చిన్నారావు గారు, బాబురావు, గంటల వెంకటస్వామి, నమ్మి రమణ, తులసి రామ్, ఐ టి డి పి అశోక్, నాగేంద్రబాబు మరియు ఎలమంచిలి టౌన్ పార్టీ ప్రశ్నించార్జిలు మరియు యూనిట్ ఇన్చార్జిలు మరియు వార్డు ప్రెసిడెంట్లు జిఎస్ లు మరియు ముఖ్య నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter