స్వగ్రామంలో ప్రజలతో మమేకమైన ఎంపీ కలిశెట్టి.

స్వగ్రామంలో ప్రజలతో మమేకమైన ఎంపీ కలిశెట్టి.

27/September/2026 19:39    Share:   

రణస్థలం, సెప్టెంబర్ 27:
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన స్వగ్రామమైన రణస్థలం మండలం వి.ఎన్.పురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో నాయకులు, గ్రామస్థులతో కలిసి పాల్గొని ఆత్మీయంగా గడిపారు.
అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. గ్రామస్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో గ్రామంలో సందడి నెలకొంది.

క్రైమ్ ఎనాలసిస్ రిపోర్టర్ చీపురుపల్లి ఎస్.ఏ.ఎన్. రాజు
Breaking News

Subscribe our Newsletter