ఎన్నికల వేళ అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు!

ఎన్నికల వేళ అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు!

17/November/2026 19:52    Share:   

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా.. రౌడీషీటర్లకు బైండోవర్
అక్రమ మద్యం, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం – సోషల్ మీడియా ప్రచారాలపైనా పోలీసుల కన్ను

అనకాపల్లి, నవంబర్ 17:
గ్రామ పంచాయతీ ఎన్నికలు-2026ను జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని, బైండోవర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మద్యం రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాల్లో ప్రహరీ గోడలు, ఫెన్సింగ్ తదితర భద్రతా ఏర్పాట్లను పరిశీలించి లోపాలను సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమన్వయంతో సరిచేయాలని సూచించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter