కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు - ఎంపీపీ రాజన శేషు

కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు - ఎంపీపీ రాజన శేషు

28/February/2026 07:02    Share:   

యలమంచిలి : కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎంపీపీ రాజాన శేషు అన్నారు. శుక్రవారం మండలంలోని శేకలిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో పల్లె పండగ : 2 నిధులు నుండి కాండ్రకోట చిరంజీవి ఇంటి నుండి బండారు అప్పారావు ఇంటి వరకు సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం. పాతూరు అమ్మాజీ ఇంటి నుండి అప్పికొండ నాగరత్నం ఇంటి వరకు సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం. అలాగే అంతర్గత రోడ్డు నిర్మాణం కొరకు అంచనా విలువ రూ. 10 లక్షలతో అభివృద్ధి పనులు నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేష గిరి రావు (శేషు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల సౌకర్యార్థం ఈ
పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి నాయకులు అన్నం బాబ్జి, లాలం సోమునాయుడు, సేనా నాని, ఆనంద్, శివాజీ, నరేష్, నూకరాజు, వాసు, కొక్కిరాపల్లి పి.ఏ.సి.ఎస్ చైర్మన్ గోపి లు సమక్షంలో పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.
Breaking News

Subscribe our Newsletter