దళిత సమస్యల పరిష్కారంపై జవహర్‌తో కీలక భేటీ చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ...
22/April/2026 06:58
Share:
అనంతపురం జిల్లా, ఏప్రిల్ (క్రైం అనాలిసిస్ రిపోర్టర్ ఆనంద్): రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ గారిని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత మాన్యశ్రీ దండు వీరయ్య మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, భూముల వివాదాలు, సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలపై విస్తృతంగా చర్చించారు. దళితుల హక్కులను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ జవహర్ సమస్యలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.