మల్లంపేటలో పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుబాడంగి, సెప్టెంబర్ 30:
బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం మల్లంపేట గ్రామంలో రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. SASCI నిధులతో ఈ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నారు.CRR (చిలకపాలెం–రామభద్రపురం–రాయగడ) హైవే నుంచి పాల్తేరు గ్రామం మీదుగా పాల్తేరు వరకు రహదారి అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, విజయనగరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు, బాడంగి మండలం టీడీపీ అధ్యక్షుడు తెంటు రవి, మాజీ ఎంపీపీలు యజ్జల లక్ష్మి, బొంతు త్రినాథ్, పీఏసీఎస్ చైర్మన్ లచ్చుపతుల సత్యం, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు