కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, శ్రీ టీజీ భరత్ గారు, శ్రీ డి. బాల వీరాంజనేయ స్వామి గార్లతో కలిసి నేడు విజయవాడలో జరిగిన 'MSME గ్రోత్ సమ్మిట్ 2026' సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఈ వేదికపై క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రూ. 200 కోట్ల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని మళ్లీ పూర్వవైభవానికి తీసుకువస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీని పరిశ్రమలకు 'సన్‌రైజ్ స్టేట్'గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది, ఇప్పటికే 100 పార్కులకు భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి.
బ్యాంకుల ద్వారా రూ. 2.11 లక్షల కోట్ల రుణాలు అందించడంతో పాటు, ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణాల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేయడమైనది. పీఎం ముద్రా, స్టాండప్ ఇండియా, విశ్వకర్మ పథకాలతో తోడ్పాటునందిస్తూ, కొత్తగా వచ్చే ఔత్సాహికులకు రూ. కోటి వరకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ "ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త" అనే ఆశయ సాధనలో ఎంఎస్ఎంఈ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది..