
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (B.S.G)
అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో, అనకాపల్లిలోని JMJ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు, విద్యార్థినీలు మరియు ఉపాధ్యాయులతో కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమం అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీ రూపంలో జరిగింది. ర్యాలీలో పాల్గొన్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో అవగాహన కల్పించారు. వాహనాలను లైసెన్స్ లేని వ్యక్తులకు, మైనర్లకు వ్వరాదని, ప్రతి వాహనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.అనంతరం నెహ్రూ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పడి నినాదాలు చేస్తూ వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కలిగించారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పనిచేశారు.