కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు,
ప్రాణరక్షణకు రక్తమెంతో అవసరమని, దాన్ని గుర్తించి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానాన్ని చేసి స్ఫూర్తిగా నిలవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరు 8వ డివిజన్ తూర్పువీధిలోని బోసుబొమ్మ దగ్గర శుక్రవారం ఘంటసాల ఖ్యాతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రక్తదానం ప్రాముఖ్యతను గుర్తించి తలసేమియాతో బాధపడుతోన్న వారికి రక్తాన్ని అందించాలనే ఉన్నతాశయంతో ఘంటసాల ఖ్యాతి రక్తదానానికి ముందుకొచ్చే వారందరినీ సమీకరించుకుని శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, ఇదేమాదిరిగా రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, క్లస్టర్ ఇంచార్జ్ మారం హనుమంతరావు,డివిజన్ ఇంచార్జ్ మారం జై సూర్య, కాకరాల గణేష్, మోహన్ సింగ్,వెన్నకోట మాధవ, వంకాయల లత, మల్లిపూడి రాజు, హరి, నందివాడ రమణ టైలర్, లాయర్ సురేష్, జిల్లేలమడి వరప్రసాద్ మరియు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు