పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో శిక్షణ

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో శిక్షణ

30/March/2026 07:42    Share:   

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో శిక్షణ – కార్యకర్తల్లో నూతన ఉత్సాహం..!
క్రైమ్ అనాల్సిస్ టివిఎస్ ప్రకాష్,
యలమంచిలి పట్టణంలోని తులసి కళ్యాణ మండపంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పార్టీ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, పిళ్లా రమా కుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిళ్లా రమా కుమారి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ చేరువయ్యాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వంటి అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట మరింత పెరిగిందని తెలిపారు.ప్రపంచ దేశాలు యుద్ధ భయాలు, క్రూడ్ ఆయిల్ సంక్షోభాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటి, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆడారి చిన్న, జానకిరామ్, అనకాపల్లి జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షురాలు సయ్యద్ బీబీ, పప్పు ఈశ్వరరావు, పిట్టా దాసు బాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter