పరిసరాల పరిశుభ్రత,నిరంతర ప్రక్రియ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
29/March/2026 07:33
Share:
ఏలూరు, మార్చి 28.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి స్వచ్ఛతే ఆరోగ్య ప్రదాయినీ అని, పరిసరాల పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇందుకు ప్రతీఒక్కరూ తమవంతుగా సహకారం అందించాలని ఆయన సూచించారు. ఏ కార్యక్రమం అయినా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామని స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్ తో నగరంలోని పలు రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 13వ రోడ్డు వినాయకుని గుడి వద్ద శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టిడిపి అధ్యక్షులు బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైనవారందరితో కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎవరికి వారు తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో,,, అదేవిధంగా పరిసరాలను కూడా ఉంచాలన్న స్ఫూర్తితో ముందడుగు వేస్తే స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 21 డివిజన్ లో మూడవ రోడ్డు వెయ్యాలని స్థానిక ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నారని, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ రోడ్డును చేపడుతున్నట్లు ప్రజల హర్షద్వానాల మధ్య ఆయన ప్రకటించారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో రోడ్ల పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ గా ఇవ్వాలని కోరిన వెంటనే ఆయన మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. కొత్త ఏడాది ఈ నిధులతో పనులు చేపట్టి మరిన్ని రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎక్కువ కాలం మన్నే సీసీ రోడ్లకు ఏలూరు నగరంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే నగరంలోని డ్రైన్ లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే డిసెంబర్ నాటికి ఈ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అనంతరం పారిశుద్ద్య నిర్వహణలో అంకితభావంతో విధులు నిర్వర్తించిన ముగ్గురు పారిశుద్ద్య కార్మికులకు ఎమ్మెల్యే బడేటి చంటి తన సొంత నిధులతో సమకూర్చిన బహుమతులను అందజేశారు. తొలుత డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటారు. అనంతరం వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు,కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ అన్నపనేని రవికుమార్, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, క్లస్టర్ కో ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, డివిజన్ ఇంచార్జిలు కొండే రాణి నిర్మల కుమారి, అట్లూరి రామకృష్ణ, డివిజన్ కో ఇన్చార్జిలు మద్దు ప్రసాద్, కేతినిడి కిషోర్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూజారి నిరంజన్, ముళ్ళపూడి అశోక్, వేల్పుల అరుణ,సతీష్, చందు, బిజెపి నాయకులు నడపన భాస్కరరావు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు