యలమంచిలి రామ్ నగర్ లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
29/March/2026 07:24
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ యలమంచిలి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలిలో రాములోరి కళ్యాణ వేడుకలు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు,పూలతో అలంకరించి,వేద పండితులచే కళ్యాణ తంతులు పూర్తి చేశారు. ముఖ్యంగా యలమంచిలి మున్సిపాలిటీ రామ్ నగర్ లో జాతీయ రహదారికి సమీపంలో గల శ్రీ సీతారామ స్వామి ఆలయంలో ఉదయం కళ్యాణం అనంతరం సాయంత్రం నుంచి శ్రీ కృష్ణ యాదవ కోలాట బృందం వారిచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో చివరిగా నృత్యం గావించిన మహిషాశుర మర్ధినితో సైతం అమ్మవారి పంచవతారాలతో ప్రదర్శించిన నృత్యంతో పాటుగా, పిల్లలు వేసిన అమ్మవారి వేషధారణలు ఆధ్యంతం అలరించాయి.ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పడాల శ్రీను కావ్య, జనసేన నాయకులు కొఠారు శ్రీనివాసు, లంకా ఉదయ్, బీజేపీ నాయకులు పప్పు ఈశ్వర్రావు, స్థానికులు ప్రగడ నర్శింహరావులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.