APEMJA జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన R. చిట్టి బాబుకి యలమంచిలి ప్రెస్ క్లబ్ సభ్యుల ఘన సన్మానం

APEMJA జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన R. చిట్టి బాబుకి యలమంచిలి ప్రెస్ క్లబ్ సభ్యుల ఘన సన్మానం

24/March/2026 16:11    Share:   

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు మెయిన్‌స్ట్రీమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APEMJA) జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన R. చిట్టి బాబు గారిని యలమంచిలి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. 
యలమంచిలి.
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు మెయిన్‌స్ట్రీమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APEMJA) జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ ఆర్. చిట్టి బాబు
గారిని యలమంచిలి పట్టణంలోని ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.చిట్టి బాబు గారు జర్నలిజం రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని,జిల్లా అధ్యక్షులుగా ఆయన ఎంపిక జర్నలిస్టులందరికీ గర్వకారణమని కొనియాడారు.జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి ఆయన కృషి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా R. చిట్టి బాబు గారు మాట్లాడుతూ:
తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు APEMJA రాష్ట్ర కమిటీకి మరియు సహచర జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు,వృత్తిపరమైన ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యలమంచిలి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, వివిధ పత్రికలు మరియు ఛానళ్ల ప్రతినిధులు,సీనియర్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter